అమెరికా అధ్యక్షుడిగా క్షణం తీరికలేకుండా గడిపిన ట్రంప్.. అయిష్టంగా పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఏం చేస్తున్నారన్న సందేహం చాలా మందిలో ఉంది. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు.. ఎలా గడుపుతున్నారని ఆరాలు తీస్తున్నారు. గతంలోనే పెద్ద బిజెనెస్‌మెన్ అయిన ట్రంప్.. ఇప్పుడు మళ్లీ అదే పనిలోకి దిగినట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా తన పాత వ్యాపారాలన్నీ నష్టాల్లోకి జారిపోవడంతో.. తిరిగి వాటిని గాడిలోకి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట.
ట్రంప్‌నకు హోటళ్లు, రిసార్ట్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు ఉన్నాయి. అయితే కరోనా కారణంగా అవన్నీ సంక్షోభంలోపడ్డాయి. దీంతో వాటి నిర్వహణకు రుణం ఇచ్చిన బ్యాంకులు, సంస్థలు చెల్లింపుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ట్రంప్ కంపెనీకి సుమారు 30 కోట్ల డాలర్లకుపైగా అప్పుల్లో ఉందని అంచనా. వచ్చే నాలుగేళ్లలోనే వీటిని తీర్చాల్సి ఉందట. దీంతో మరికొద్ది రోజుల పాటు సీరియస్‌గా వ్యాపారంపై దృష్టిపెట్టబోతున్నారట ట్రంప్.