- బరితెగిస్తున్న ఇసుక మాఫియా
- ఏటూరు నాగారంలో పట్టాభూములంటూ అరాచకం
- వాగు నడి మధ్యలో తవ్వకాలు
- భూములు పాడవుతాయని అడ్డుకున్నఆదివాసీలు
- మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్నఅధికారులు
- మంత్రి అండదండలతో రెచ్చిపోతున్నసుధీర్
- దొంగ పట్టాలతో ఆదివాసుల పొట్టకొడుతున్న గులాబీ మాఫియా
- ఇసుకాసురులు పేరుతో..
- తొలివెలుగు కథనాలతో అడవిబిడ్డల్లో చైతన్యం
రామప్ప పుణ్యక్షేత్రం కొలువైన ములుగు జిల్లా.. అందరికీ భక్తిశ్రద్ధల కేంద్రం. కానీ ఎందరో త్యాగాలతో సాధించుకున్నతెలంగాణ అడుగడుగునూ అడ్డంగా బుక్కేస్తున్న గులాబీ మాఫియాకు మాత్రం… అదో బంగారు గని. అవును.. ములుగు జిల్లా గులాబీ ఇసుక మాఫియా పాలిట బంగారు గుడ్లు పెట్టే బాతులా తయారైంది. ఇంతకీ వీళ్లు చేసే దందా ఎలా ఉంటుందంటే..! పట్టా భూముల్లో ఇసుక మేట పెట్టిందని దాన్నితీసుకుని మళ్లీ సాగు చేసుకునేందుకు అంటూ..అనుమతులు తీసుకుంటున్నారు.కాని అసలు పట్టాదారుడు అక్కడ ఉండడు.అగ్రిమెంట్ల రూపంలో గులాబీ లీడర్లు పాగా వేస్తారు.
కోటి రూపాయల ఇసుక తీస్తే..5 లక్షలు యజమానికి ఇచ్చి..అక్రమంగా దందా చేస్తారు.పట్టా పేరుతో నడివాగులోకి వెళ్లి జేసీబీలు పెట్టి తవ్వేస్తున్నారు.పట్టా భూముల్లో పరాకాష్ట అంటూ..ఎలా దందా చేస్తున్నారో గతంలో తొలివెలుగు కథనాలు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగేది ఒకటే.. అది అసలైన రైతులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇది గమనించిన ఆదివాసుల బిడ్డలు అడ్డం తిరిగారు.జంపన్నవాగులో ఇసుక తీయడం వలన గ్రామానికే పెనుముప్పు ఉందని గూడెం అంతా ధర్నా చేసింది. కాని అధికారులు మాత్రం స్పందించడం లేదు.
మనుగడ కోల్పోతున్న జంపన్న వాగు
నడివాగులో ఇసుక తవ్వుతున్నప్పటికీ ఏ అధికారి కూడా పట్టించుకోవడంలేదని ధర్నాచేశారు. ఊరు సర్పంచ్ వెళ్లి అడ్డుకున్నా, ఎవరైతే నాకేంటి అంటూ..మంత్రి అండదండలతో రెచ్చిపోతున్నారు. ఈ వాగులో ఇసుక తవ్వడం వల్ల, వచ్చే వర్షాకాలంలో తమ సాగు భూములు జంపన్న వాగు ఉధృతికి కొట్టుకుపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఏటూరునాగారం చుట్టూ ఉన్నకరకట్టకు ముప్పు పొంచి ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారు.
Advertisements
కాంట్రాక్టర్ ని ఏటూరునాగారం సర్పంచ్ వివరణ అడగగా నువ్వు ఎక్కడ సర్పంచ్ వో నాకు తెలియదు..నీకు చెప్పవలసిన అవసరం లేదు అంటునే దురుసుగా సమాధానం చెప్పాడు. అంతేగాకుండా గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమఇసుక మాఫియాతో కోట్లకు పడగలెత్తుతున్నారు. టీఎస్ఎండీసీ, రెవెన్యూ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని క్వారీ వైపు వెళ్లిన వారిని ఖతం చేయడానికి కూడా వెనకడుగు వేయకుండా ఉన్నారంటే.. గులాబీల దందా ఎలా కొనసాగుతుందో ఇట్లే అర్ధం చేసుకోవచ్చు.