• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » తెలంగాణ సమాజమా నన్ను పట్టించుకో..మీ ఉస్మానియా విశ్వవిద్యాలయం

తెలంగాణ సమాజమా నన్ను పట్టించుకో..మీ ఉస్మానియా విశ్వవిద్యాలయం

Last Updated: February 13, 2020 at 1:19 pm

ప్రియమైన తెలంగాణ ప్రజలారా,
నమస్తే,

నేను ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మాట్లాడుతున్నాను.
మీ అందరూ ఎంతో ప్రేమగా ‘తెలంగాణా చదువుల తల్లి’గా పిలుచుకుంటున్న ఓయూని మాట్లాడుతున్న. నన్నింతకాలం అత్యంత ప్రేమతో, బాధ్యతతో ఆదరించిన మీ అందరికీ శనార్థులు.

మీ గోడు వినడమే కానీ ఎన్నడూ నా గురించి చెప్పుకోలేని నేను ఇవాళ నా మనసువిప్పి మాట్లాడుతున్న. వందేడ్లు మీ బాగోగులు చూసుకున్న నా పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగాలేదు బిడ్డ. నన్ను నేను చూసుకుంటే నాకే అసహ్యంగా ఉంది. *నిజాం హాయంలో (1917) పురుడుపోసుకున్నాను కదా, వందేండ్లు నిండినయి ఈ వయసులో ఇలానే వుంటుందిలే అనుకునేరు. ఇది వయసు వల్ల వచ్చిన పరిస్థితి కాదు. నన్ను పోషించేవాళ్ళు, నా ఆలనా పాలనా చూసేవాళ్ళు లేక దయానీయస్థితిలో ఉన్నాను. నాపట్ల కాస్త శ్రద్ధ పెట్టి బాగోగులు చూసుకుంటే మీ అందరికీ గతంలో ఎలా సేవలు చేశానో భవిష్యత్తు తరాలకు కూడా అలానే చేస్తాను.

నా ఒడిలో విద్యా బుద్ధులు నేర్చుకొని, నా సేవలు పొందిన వాళ్ళు ఇవాళ పాలకులలుగా, బాధ్యతాయుతమైన పదవుల్లో అధికారులుగా, మేధావులకు, శాస్త్రవేత్తలుగా, ఉద్యోగస్తులుగా, వ్యాపారవేత్తలుగా ఉన్నారు. అది ఒకందుకు నాకు గర్వకారణమే.కానీ, ఇంత మందిని అందించిన నా ప్రస్తుత పరిస్థితి మాత్రం దీనంగా ఉంది. నా ఆలనా పాలనా చూసేవాళ్లే కరువయ్యారు. సమాజానికి నేను చేసిన సేవలను ఓ సారి గుర్తు గుర్తుచేస్తే యినా మీరు నా గురించి ఆలోచిస్తారని ఓ చిన్ని ఆశతో నా గోడును మీతో చెప్పుకుంటున్నాను బిడ్డ. కనీసం నా గోడును వినైనా, గత వైభవాన్ని చూసైనా మీ కరుకు గుండె కరగక పోతుందా అన్న నమ్మకం ఇలా నాచేత ఏకరువు పెట్టిస్తోంది.

సరిగ్గా భారత స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో నేను పురుడుపోసుకున్నాను. కాస్త వయసులో ఉన్నప్పుడే నా బిడ్డలు ‘వందేమాతరం గీతం’ పాడారు అనే సాకుతో కఠినాత్ముడైన నిజాం నా బిడ్డల్లో కొందరిని దూరం చేశాడు. పుట్టెడు దుఃఖంతో వాళ్లకోసం పోరాటం చేసాను. దాన్నుండి తెరుకున్నానో లేదో నైజాం సంస్థానంలోనో భూస్వాములు నిజాం అండదండలతో సబ్బండ వర్గాలపై పడి రాబందులుల్లా పీకుంటున్నప్పుడు వాళ్ళను ప్రతిఘటించడానికి నా కన్న బిడ్డలను ఉద్యమానికి ధార పోసాను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నేను పోరుగడ్డనయ్యాను. నా ఒడిలోని ఆడి, పాడిన బిడ్డలు వీరుల్లా పోరాడి నిరంకుశ పాలను నుంచి విముక్తిని కల్పించారు.

ఓవైపు విద్యాబుద్ధులు నేర్పుతూనే వీరుల్ని తయారు చేసిన నేను నా ఒడిలోకి చేరిన బిడ్డలపట్ల ఏనాడు వివక్షత చూపలేదు. వెలివాడల నుంచి గ్రామ అంచుల దాకా ఎక్కడివారికైనా నేను నేర్పిన అక్షరం వారి జీవితాల్లో దీపాలు వెలిగించాను కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత భేదాలను తొలగించడానికి అవసరమైన సైద్ధాంతిక చర్చను నా ఇంట్లోనే నేర్పాను. నూరు పూలు వికసించని, వేయి ఆలోచనలు సంఘర్శించని అన్నట్లు విభిన్న భావజాలాలు కలిగిన విద్యార్థి సంఘాల ఆవిర్భావానికి నేనే ఊపిరిపోసాను. అనేక ఆస్తిత్వ సంఘాలకు కూడా నేనే చేదోడు వాదోడుగా ఉన్నాను. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష కార్యాచరణ కేంద్రాన్ని నేనే. తెలంగాణ వెనుకబాటుకు కారణాలను అన్వేషించి అనేక ఆలోచననలకు, ఆవేశ పూరిత ప్రసంగాలకు నా ప్రాణం పోశాను. సీమాంధ్ర వలసవాదుల నుండి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి అనేక మంది నా పిల్లలు ప్రాణాలు త్యాగం చేసారు. నా పిల్లల రక్త మాంసాలతోనే నేడు తెలంగాణ ఏర్పడ్డది. పార్టీలకు అతీతంగా అధికారం చలాయించినా వారందరు నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే. మట్టి ముద్దలుగా వచ్చే పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాను. ప్రపంచ వ్యాప్త సమస్యలకు నా పిల్లల దగ్గర సైద్ధాంతిక పరిష్కారం లభించింది. నా పిల్లలు ఎంతో ఘనమైన మేధో సంపత్తిని కలిగి సమాజాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయారు. ఈ విధంగా గతంలో నా పరిస్థితి వైభవంగా సాగింది.

ఇదంతా నా గతం బిడ్డ. కానీ ప్రస్తుతం నేను అనేక సమస్యలతో సతమతమవుతున్నాను. నేను ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా మీ దృష్టికి తీసుకువస్తాను. వీలైతే నా కోసం పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితి వచ్చింది. నేను ఆర్థికంగా చితికిపోయాను. నా కోసం నా పిల్లల కోసం తమ జీవితాన్ని ధార పోసిన నా ఉద్యోగస్తులకు జీతాలు, పెన్సన్లు ఇచ్చి వారిని ఆదుకోలేని స్థితికి చేరుకున్నాను. ఆస్తులు సంపాదించలేదని వారసులు తల్లిదండ్రులను తిట్టినట్లు నన్ను తిట్టని తిట్లు తిడుతున్నారు. నా దగ్గరికి చదువుకోవడానికి వచ్చే పిల్లల సంఖ్య పెరిగిపోయింది. పిల్లలకు చదువు చెప్పడానికి అవసరమైన అధ్యాపకులను, సహాయ సిబ్భందిని సమకూర్చుకోలేక పోతున్నాను. అంటే నియామాకాలు జరగడం లేదు. నన్ను నడిపించే పాలక మండలి తెలంగాణ వచ్చిన నాటి నుండి ఏర్పడనేలేదు. నా పెద్ద కొడుకులాంటి వైస్ చాన్స్‌లర్ గత ఆరు నెలలుగా లేనే లేడు. అతను లేకపోవడం మూలంగా నా పాలన అంతా కుంటుబడిపోయిది. అవినీతి పెరిగిపోయింది. నా చిన్న పిల్లల మధ్య సమన్వయం లోపించింది. నాకు పెద్ద కొడుకు కావాలి. వాడు ఉంటే గానీ నేను చక్కబడలేను. నన్ను పరిపాలించే పాలక మండలికూడా కావాలి. విద్యార్థి అనుకూలమైన నిర్ణయాలు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. కనుక నా పిల్లలను నా దగ్గరికి చేర్చండి. నన్ను కాపాడండి.

ముష్టి వేసినట్లు నాకు కొంత నిధులను కేటాయిస్తున్నారు. వాటితో నన్ను ఎలాగోలా బతకమని అదేశిస్తున్నారు. కానీ చాలీచాలని నిధులతో నా పిల్లని చంపుకోలేక గంజినీళ్లు పోస్తూ బతుకీడుస్తున్నాను. నా పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నాను. పదవి విరణం చేసి రోజు రోజుకు టీచర్లు తగ్గిపోతున్నారు. ఒకనాడు వేలమంది అధ్యాపకులతో కళకళలాడే నా ఇల్లు ఇవాళ బోసి పోతుంది. 2013 నుండి ఇప్పటి వరకూ అధ్యాపకుల నియామకాలు లేవు. గత రెండున్నర దశాబ్దాలుగా నాన్ టీచింగ్ నియమాకాలు కూడా జరగలేదు. సరైన సదుపాయాలు లేక విద్య సరిగ్గా అందడంలేదు. కళ్ల ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా నోరు ఉండి మాట్లాడలేని దానినయ్యాను. తెలంగాణకు ఓ నాడు విజ్ఞాన భాండాగారంగా వెలుగొందిన నేను ఇవాళ నిసహాయ స్థితిలో ఉన్నాను. నా దగ్గరకు వస్తే ఎలాగో ఆదరిస్తానని ఇప్పటికీ తెలంగాణ మారుమూలల నుండి వేలాది మంది విద్యార్థులు ఎంతో ఆశగా నా దగ్గరకు వస్తూనే ఉన్నారు.వారికి మంచి భవిష్యత్తును కల్పించాలని బలమైన కోరిక ఉన్నా ఇక్కడి అకాడమిక్ వాతావరణం దెబ్బతినడం వల్ల నెరవేరని కోరికగా మిగిలిపోయింది. నిధులు లేకపోవడంతో నైజాం కాలంలో గుర్రాలను కట్టేసిన గుర్రపు శాలలే నా పిల్లలకు హాస్టళ్లు గా కొనసాగుతున్నాయి. వాటికీ సరైన నిర్వాహణ లేక కూలిపోయి శిథిలావస్థలోకి చేరుకున్నాయి. అందులో నివసిస్తున్న నా పిల్లలు బిక్కుబిక్కుమంటున్నారు.

మహాలఖ చందా బాయీ అనే నర్తకి దాతృత్వంతో నాకు ఇచ్చిన వందలాది ఎకరాలను చాలా మంది కబ్జా చేస్తున్నారు. మరికొంతమంది గుడుల పేరుతో, మసీదుల పేరుతో మత మాఫియాను కొనసాగిస్తున్నారు. విజ్ఞానంతో వెలగాల్సిన కళాశాలలు అవినీతికి అడ్డాగా మారిపోతుంది. రక్తం ధారపోసి తెలంగాణ ను సాధిస్తే నా పిల్లలకు దక్కాల్సిన ఉద్యోగాలు ఆంధ్రా ప్రొఫెసర్ల పిల్లలకి అడ్డదారిలో ఉద్యోగాలు కల్పించారు. నా పిల్లలు మాత్రం ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇన్నీ ఘోరాలను చూస్తూ నకూడా చూసి ఇంకా నేను జీవశ్చవంగా బతికి ఉన్నాను. విలువైన పరిశోధన పత్రాలు రాయాల్సిన నా పిల్లలు విధిలేక పోరబాట పట్టాల్సి వస్తుంది.

ప్రియమైన తెలంగాణ ప్రజలారా నన్ను కాస్త పట్టించుకోండి. నా ఒడిలో రాజకీయ ఓనమాలు దిద్దిన రాజకీయ నాయకులు నన్ను పట్టింటుకోవడం లేదు. ఓయూని పట్టించుకోవడమంటే తెలంగాణ భవిష్యత్తుకు మార్గం వేయడమేనని గుర్తెరగండి ఓ విద్యార్థులారా, ఉద్యోగుల్లారా, అధ్యాపకుల్లారా, మేధావుల్లారా, పాలకుల్లారా, కవులారా, రచయితలారా నన్ను నా సమస్యల నుండి రక్షించుకోండి. మీ అమ్మను మీరే కాపాడుకోండి. నా శక్తి ఉడిగిపోయింది. తల్లిపాలు తాగి రొమ్ముని గుద్దినట్లు చేయకండి.

ఆలోచించండి……

ఇట్లు…
మీ ఉస్మానియా విశ్వవిద్యాలయం.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఆ ద్రోహాన్ని మరచి పోము

ఒకటి కాదు, రెండు కాదు.. అన్నీ ఫ్లాపులే

విడుదల వాయిదా… రీజన్ చెప్పిన దిల్ రాజు

కుక్కపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

మాచర్ల నియోజకవర్గం అప్ డేట్స్

పుప్పాలగూడలో గోడకూలి ముగ్గురు కార్మికులు మృతి

సీతారామం.. ఓ మిలటరీ ప్రేమ కథ

ఫ్లిప్‌కార్ట్‌తో సెర్ప్ ఒప్పందం…

ఉపాధ్యాయులను వేధించేలా టీఆర్ఎస్ సర్కారు నిర్ణయాలు..!

సరిహద్దుల్లో మేడ్ ఇన్ ఇండియా ఐఎపీవీలు… వీడియోలు వైరల్

శివసేన కీలక నిర్ణయం…. వారికి నోటీసులు…!

వరద బీభత్సం… 118కి చేరిన మృతుల సంఖ్య

ఫిల్మ్ నగర్

ఒకటి కాదు, రెండు కాదు.. అన్నీ ఫ్లాపులే

ఒకటి కాదు, రెండు కాదు.. అన్నీ ఫ్లాపులే

విడుదల వాయిదా... రీజన్ చెప్పిన దిల్ రాజు

విడుదల వాయిదా… రీజన్ చెప్పిన దిల్ రాజు

కుక్కపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

కుక్కపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

మాచర్ల నియోజకవర్గం అప్ డేట్స్

మాచర్ల నియోజకవర్గం అప్ డేట్స్

సీతారామం.. ఓ మిలటరీ ప్రేమ కథ

సీతారామం.. ఓ మిలటరీ ప్రేమ కథ

మై డియర్ లవ్.. నాక్కూడా డాన్స్ నేర్పించవా..?

మై డియర్ లవ్.. నాక్కూడా డాన్స్ నేర్పించవా..?

రిలీజ్ కానీ సౌందర్య సినిమా! ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ల్యాబ్ లో కాపీ

రిలీజ్ కానీ సౌందర్య సినిమా! ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ల్యాబ్ లో కాపీ

పఠాన్‌ ఫస్ట్‌ లుక్‌.. బాద్‌ షా ఆగయా!

పఠాన్‌ ఫస్ట్‌ లుక్‌.. బాద్‌ షా ఆగయా!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)