హీరోయిన్ పూర్ణ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా కీ రోల్ క్యారెక్టర్ తో పాటు బుల్లితెర షో లకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఎంతో యాక్టివ్ గా ఉండే పూర్ణ తన కామెడీ టైమింగ్ తో కూడా అదరగొడుతుంది.

అయితే పెళ్లి విషయంలో ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న పూర్ణ ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేస్తూ తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. దీనితో వెంటనే నెటిజన్స్ పూర్ణ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
పూర్ణ చేసుకోబోయే వ్యక్తి పేరు షానిధ్ అసిఫ్. ఈయన యూఏఈలో వ్యాపారవేత్త. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా కూడా తెలుస్తోంది. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సీఈఓ, ఫౌండర్ కూడా. సెలబ్రిటీలకు వీసా లను ఆ కంపెనీ ద్వారా అందిస్తూ వుంటారు. కాజల్, ప్రణీత, ప్రియమణి, శ్వేతా మీనన్, విజయ్ సేతుపతి, ఆండ్రియా, నాజర్ కు కూడా ఈయన వీసాలు అందించాడు.
మొదటి నుంచి పూర్ణ ఫ్యామిలీ తో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. కేరళకు చెందిన ఓ సినిమా వేడుకలో కలిసి పాల్గొన్న ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలను కూడా ఒప్పించారు. కాగా ఈ ఇద్దరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisements
Also Read: హారతి కళ్ళకు అద్దుకోవడం ఎందుకు మంచిది…?