[sonaar_audioplayer artwork_id=”” feed=”https://tolivelugu.com/wp-content/uploads/2022/05/sand-7.mp3″ player_layout=”skin_float_tracklist” hide_progressbar=”default” display_control_artwork=”false” hide_artwork=”false” show_playlist=”false” show_track_market=”false” show_album_market=”false” hide_timeline=”false”][/sonaar_audioplayer]
– ప్రశ్నిస్తే అక్రమ కేసులు..
– ఆదివాసీలనీ వదలని వైనం
– ఇసుక రీచ్ లలో గులాబీ దందా
– రోజురోజుకీ పేట్రేగిపోతున్న పింక్ గ్యాంగ్
– కలెక్టర్లను సైతం బ్లాక్ మెయిల్!
– గత ఎన్నికల్లో ఓడిపోయినా మారని తీరు
– పదివేల కోట్ల ఇసుక దోపిడీ
క్రైంబ్యూరో, తొలివెలుగు:అధికారం మనదే.. అడిగే వాడు ఎవడు.. ఎదురు తిరిగేవాడు ఎవడు.. ఎవరన్నా వస్తే ఏం చేయాలో ప్లాన్ రెడీ. ఇదీ టోటల్ గా గులాబీల గూండాగిరి. మరీ ముఖ్యంగా ఇసుక రీచ్ ల దగ్గర వీరి ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఏం చేసినా ఎదురు మాట్లాడకూడదు.. గులాం గురి చేయాల్సిందే. లేకపోతే.. అక్రమ కేసులు స్వాగతం చెప్తాయి. అదే అధికారులైతే బదిలీ వేటు తప్పదు. ఇలా ఇసుక రీచ్ లలో ఇష్టారాజ్యంగా గులాబీ దందా కొనసాగుతోంది. భద్రాది కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఉండే ఇసుక మాఫియా చేతిలో అధికారులు కీలు బొమ్మల్లా మారారు. వాటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు గత సాధారణ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక్క సీటు గెలవలేకపోయింది టీఆర్ఎస్. అయినా.. అరాచకాలు మాత్రం ఆపడం లేదు.
నిలదీస్తే అక్రమ కేసులు
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఇసుక మాఫియాపై తొలివెలుగు క్రైం బ్యూరో కథనాలు రాసింది. ఆదివాసీల్లో అవగాహన కల్పించింది. వారు ఎంత నష్టపోతున్నారో వివరించింది. హక్కులను కాలరాయడమే కాకుండా.. ఊరుకే ముప్పు వచ్చేలా జంపన్న వాగును తోడేస్తున్నారని గుర్తుచేసింది. దీంతో ఆ ఊరు సర్పంచ్ రామ్మూర్తి ప్రజలతో కలిసి వెళ్లి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. గోదావరి ఉద్ధృతికు 1986లో ఏటూరు నాగారం మునిగిపోయింది. అప్పటి ప్రభుత్వం ఏటూరునాగారం, రామన్నగూడెం గ్రామాల చుట్టూ అప్పట్లోనే రూ.60 కోట్లు ఖర్చు చేసి కరకట్టను నిర్మించారు. గోదావరి వరద పెరిగినా.. ఈ గ్రామలకు ముప్పులేదు. ఈ కరకట్టనే కాపాడుతోంది. అయితే.. జంపన్న వాగు కలిసే చోట పట్టాభూముల పేరిట అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. దీంతో రక్షణ కవచంలా ఉండే ఈ కరకట్ట కోట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే తొలివెలుగు కథనాల తర్వాత ఈనెల 2న వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఇసుక మాఫియా ఎక్కడా లెక్క చేయలేదు. పదిరోజుల తర్వాత.. తమని 10 లక్షలు డిమాండ్ చేశారని సుధీర్ అనే ఇసుక క్వారీ ఓనర్ ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి వెళ్లిన గ్రామస్తులందరిపై ఐపీసీ 341, 385, 290, 447 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఎలాంటి ఆస్తులు ధ్వంసం చేయలేదు. నిరసన తెలిపినందుకు వారి ఆస్తులను ధ్వంసం చేసినట్లు కేసులు పెట్టారు. లోడింగ్ ఆపినందకే ఇలాంటి వ్యవహారం కొనసాగించడంపై ఆదివాసీలు తీవ్ర అందోళనలో ఉన్నారు.
కలెక్టర్ నే బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇసుక మాఫియా
ములుగు కలెక్టర్ ని ఆ జిల్లా జెడ్పీ ఛైర్మన్ జగదీశ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. కలెక్టర్ ని బదిలీ చేయాలని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నాడు. ఓ ఎమ్మెల్సీతో గట్టి పైరవీలు నడిపిస్తున్నాడు. ఇసుక అక్రమ క్వారీల అనుమతి ఇవ్వకపోవడం.. ఓవర్ లోడింగ్ నుంచి మొదలుకొని కొన్ని అతిగా చేసే అక్రమాలపై హెచ్చరించడమే ములుగు జిల్లా కలెక్టర్ చేసిన తప్పుగా గులాబీ నేతలు భావిస్తున్నారు. కొత్తగూడెం కలెక్టర్ ఇసుక మాఫియాకు మొదట్లో అడ్డుతగిలినా ఆ తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా ఈ పదివేల కోట్ల దందాకు అడ్డు వస్తే అక్కడ లేకుండా చేసి అక్రమంగా దోచేసుకుంటోంది గులాబీ గ్యాంగ్.
రాజకీయ భవిష్యత్ కాదు.. కాసుల కక్కుర్తే ముఖ్యం
అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడమే ముఖ్యం. ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు. సహజ సంపదను ఎలా పాడుచేసినా పట్టించుకోరు. నాలుగు చేతులు చాచి ఎలా దొచుకోవాలో అనే దాని పైనే దృష్టి ఉంటుంది. అందుకే గత ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఈ ఇసుక మాఫియా అడగాలతోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మంథని, ములుగు, పినపాక, భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. పినపాక నుంచి గెలిచిన ఎమ్మెల్యే.. గులాబీ పార్టీలో చేరి ఇసుక మాఫియాకు లీడర్ గా వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లాలో జెడ్పీ చైర్మన్ జగదీశ్ మాఫియాకు అండగా ఉంటున్నాడు. కాళేశ్వరంలో మధుతో పాటు.. లోకల్ టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని విమర్శలు ఉన్నాయి. వీరందరికీ మరోసారి ఆ ప్రాంతంలో నేతగా ఎదిగే అవకాశాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బు సంపాదించడం.. అక్రమంగా కేసులు బనాయించడం.. సహజ సంపద దోపిడీ.. అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గతంలో కంటే ఘోరంగా బుద్ది చెప్పడానికి రెడీ అయినట్లు సర్వేలలో బయటపడినట్లు వినికిడి.