వసంత పంచమి పండుగ సందర్భంగా పలు పుణ్యక్షేత్రాలకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. మొత్తం 108 బస్సులను ప్రత్యేకంగా కేటాయించింది, నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88, సిద్దిపేటలాలోని వర్గల్ కు 20 బస్సులు నడుపుతున్నామని వెల్లడించింది. బుధ, గురువారాల్లో ఈ బస్సులు ఆయా డిపోల నుంచి నడుస్తాయని తెలిపారు.
బాసరకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు వివరించారు. వర్గల్ కు సికింద్రాబాద్ నుంచి ప్రతి అరగంటకో బస్సు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్ గురుద్వారా నుంచి 10, జేబీఎస్ నుంచి 6, గజ్వేల్ నుంచి 2, సిద్ధిపేట నుంచి 2 బస్సులను నడుపుతున్నామని తెలిపారు.
వసంత పంచమి సందర్భంగా బాసర, వర్గల్ కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 108 బస్సులను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అదనపు సర్వీసులను సంస్థ పెంచుతామన్నారు.
ఈ ప్రత్యేక బస్సు సర్వీస్ లను ఉపయోగించుకోవాలని భక్తులకు సూచించారు. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని తెలిపారు.