– ఏప్రిల్ 14 నుంచి బండి రెండో విడత పాదయాత్ర
– స్పెషల్ వీడియో వదిలిన బీజేపీ రాష్ట్ర శాఖ
– కేజీఎఫ్ మూవీ డైలాగ్స్ తో సంచలన వీడియో
– బలంగా తయారైన బీజేపీ సోషల్ మీడియా
రాజకీయాల్లో ప్రచారం చాలా ముఖ్యం. ట్రెండ్ కు తగ్గట్టు ఫాలో అయితే.. నలుగురి నోట్లో పేరు నానుతూ ఉంటుంది. తెలంగాణ రాజకీయాలనే చూడండి. ఏ పార్టీని చూసినా సోషల్ మీడియా విభాగాలు పటిష్టంగా ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు ఏదైనా కార్యక్రమం తలపెట్టినా.. కావాలనే అవతలి పార్టీని తిట్టిపోయాలన్నా ఒక పార్టీ మించి మరో పార్టీ పోటీ పడీ మరీ పోస్టులు పెడుతున్నాయి. అలాగే తమ నాయకుడిని ప్రమోట్ చేయడంలోనూ పోటీ పడుతున్నాయి.
తాజాగా రాష్ట్ర బీజేపీ.. సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అది.. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన రెండో విడత ప్రజా సంకల్ప యాత్ర గురించి. అయితే.. అందులో ఓ వాయిస్ ఓవర్ వినిపించింది. అది కేజీఎఫ్ పార్ట్ 2 సినిమా ట్రైలర్ లోనిది. బండి సంజయ్ కు సూట్ అయ్యేలా కొన్ని మాటల్ని తీసుకుని గత పాదయాత్రకు సంబంధించిన వీడియోలతో దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజానికి బీజేపీ సోషల్ మీడియా విభాగం చాలా పవర్ ఫుల్. చిన్న పోస్ట్ చేస్తే చాలు క్షణాల్లో లక్షల మందికి చేరుతుంది. ప్రస్తుతం బండి వీడియో అందరి ఫోన్లలోకి చేరుతోంది. ఇక.. ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.
మొదట విడత పాదయాత్ర కేవలం 36 రోజులు పాటు సాగితే.. ఈసారి మాత్రం 200 రోజులకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండేలా ఈ పాదయాత్ర కొనసాగనుంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర
ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం నుంచి ప్రారంభం pic.twitter.com/eiXtEcvD5h
— BJP Telangana (@BJP4Telangana) March 25, 2022
Advertisements