సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సునీల్, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అయితే నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అలాగే ఒక సరికొత్త కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు శంకర్. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పోస్టర్ మరియు ఈవెంట్ కి సంబంధించి ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తున్నట్లు వినికిడి. మరి చూడాలి ఆ స్పెషల్ వీడియో ఎప్పుడు వస్తుందో.