నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే అన్ స్టాపబుల్-2 షోకి మొదటి గెస్ట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ సరికొత్త రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నో సీరియస్ పొలిటికల్ ఇష్యూస్ తో పాటు నవ్వుల వర్షం కూడా కురిపించారు. కాగా ఇప్పుడు మరో సార్ట్ కమ్ పొలిటీషియన్ ఈ షోకి గెస్ట్ గా రాబోతున్నారట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మరి అది ఎవరో తెలుసుకోవాలని ఎంతో క్యూరియాసిటీగా ఉంది కదా.
అప్పుడే అన్ స్టాపబుల్ నుంచి సెకండ్ ఎపిసోడ్ ప్రోమోని కూడా రిలీజ్ చేసేశారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ సందడి చేశారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగాయి. ప్రోమో చూశాక ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే ఎపిసోడ్ లో నిర్మాత నాగవంశీ కనిపించి.. తమ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ బయటకు వెళ్లడం ఇష్టం లేదని తెలిపారు.
వెంటన్ త్రివిక్రమ్ కి బాలకృష్ణ ఫోన్ చేసి.. అన్‌స్టాపబుల్-2 షోకి ఎప్పుడొస్తున్నావు అని అడిగారు. దీనికి త్రివిక్రమ్ సమాధానమిస్తూ.. మీరెప్పుడంటే అప్పుడు వస్తాను అని చెప్పారు. దీంతో బాలయ్య ఎవరితో రావాలో తెలుసు కదా.. అని హింట్ ఇచ్చారు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ సినిమా మ్యూజిక్ ప్లే అవ్వడంతో త్వరలో అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి వస్తారని అంతా భావిస్తున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే.
ఒకవేళ పవన్, బాలయ్య ఒకే స్టేజ్ పై కలిస్తే అభిమానులకు ఇక ఐ ఫీస్టే అని చెప్పవచ్చు. పవన్-బాలయ్య ఒకే స్టేజి మీద కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా. ఈ షో ప్రోమో వచ్చిన కొద్దిసేపటికే బాలయ్య-పవన్ కాంబో గురించి చర్చ మొదలైపోయింది. సోషల్ మీడియాలో అయితే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఈ ఎపిసోడ్ కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి నిజంగానే పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ కి వస్తారో.. లేదో చూడాలి.