ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య లక్షా 58వేల 764కు చేరుకుంది. గత 24 గంటల్లో 52,834 శాంపిల్స్ పరీక్షించగా 8,555 కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20,65,407 పరీక్షలు జరిగాయి. ఇవాళ నమోదైన కేసుల్లో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1227 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 67 మంది కరోనాతో మృతి చెందగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1474 మంది కరోనాతో చనిపోయారు. ఇవాళ చనిపోయిన వారిలో కృష్ణా జిల్లా-11, గుంటూరులో 8, తూర్పుగోదావరి 7,విశాఖపట్నం 7, కర్నూలు 6, నెల్లూరు 6,శ్రీకాకుళం 5,ప్రకాశం 4,చిత్తూరు 03,కడప 3,విజయనగరం 3,అనంతపురం 2,పశ్చిమగోదావరి 2మరణాలు సంభవించాయి.