తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 1896 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 82 వేల 647కి చేరింది. ఇటు నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 8 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 645కి పెరిగింది.
నిన్న కరోనా బారి నుంచి 1788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 59 వేల 374కి చేరింది. ప్రస్తుతం మరో 22 వేల 628 మంది చికిత్స తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా నిన్న 18 వేల 35 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1896 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 959 రిపోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాజిటివ్ రేట్ 10.5 శాతంగా నమోదైంది. అంటే కొద్ది రోజులుగా కేసులు నమోదవుతున్న తీరు చూస్తోంటే.. రాష్ట్రంలో నిన్న తీవ్రత పెరిగినట్టే.