సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది. బ్రతకడానికి భారతదేశాన్ని మించిన దేశం లేదు… ఎక్కడ కావాలంటే అక్కడ తుమ్మొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తొంగోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉమ్మొచ్చు అని… చాలా మంది ప్రవర్తన చూస్తే అది నిజమే అనే భావన కలుగుతుంది. రోడ్లపై కిల్లి తిని ఉమ్ము వేయడం, ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోయడం అనేది నిత్యం మనం చూస్తూనే ఉంటాం. జరిమానా ఉంటుందని తెలిసినా సరే అది కచ్చితంగా జరుగుతుంది.
Also Read:షీనాబోరా హత్యకేసులో నిందితురాలికి బెయిల్
అయితే ఇప్పుడు ఉమ్ము వేసే వాళ్ళ విషయంలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సీరియస్ గా ఉంటున్నారు. తాజాగా బెంగళూరులో జరిమానా విధించారు అధికారులు. దీనికి సంబంధించిన ఒక ఫోటో బాగా వైరల్ అయింది. బెంగళూరు అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వ్యక్తులకు జరిమానా విధించడం మొదలుపెట్టారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తమ తమ నగరాల్లో కూడా ఇలాంటి జరిమానాలు ఉండాలని కోరుతున్నారు.
ముంబై సహా మహారాష్ట్రలోని కీలక నగరాల్లో భారీ జరిమానాలు విధిస్తే మంచిది అని కొందరు కోరుతున్నారు. ఇక బండి మీద వెళ్ళే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రద్దు చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మివేసే ప్రతి ఒక్కరికీ ఇలా జరిమానా విధించినట్లయితే రోడ్డు పన్ను మాదిరిగా దీన్ని కూడా గౌరవిస్తారని పలువురు కోరుతున్నారు. ఇండియా మొత్తం ఇలా విధిస్తే వ్యాపించే వైరస్ లు కూడా తగ్గుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read:ఆంధ్రా పాలకులతో కేసీఆర్ కుమ్మక్కు- కోదండరాం