సంపత్ సీనియర్ పాత్రికేయులు
తెలంగాణకు గుండెకాయ మన హైదరాబాద్… అలాంటి నగరంలో ఏం జరుగుతున్నదో … ప్రస్తుత కరోనా కాలంలో నిజాలు మాట్లాడుకుందాం… తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నానంటే.. నేనుపాల్గొన్నానని.. మేం లేక పోతే తెలంగాణ వచ్చేదికాదని… ఇలా ఎనకట ఎల్లగుర్రాన్ని ఎక్కాం.. మా ముడ్లు కాయలు కాశాయని.. ఎవడికి వాడే గొప్పలు చెప్పుకోవడం అలవాటై పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా పాసుపండ్ల దాసరి లాగా పాత పాటే పాడుతున్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందో, ఎలా వున్న తెలంగాణ.. ఏవిదంగా మారిందో ఎవడూ ఆలోచించడంలేదు..దానిపై విశ్లేషించే దైర్యం కూడా చెయ్యడం లేదు. ప్రస్తుత పాలకులు ఏది చెబితే అదే నడుస్తున్నది. మేదావులు కూడా అదే పాట పాడుతున్నారు. తెలంగాణ రాక ముందు ఓ దొర చెబుతుండే వాడు, దున్నపోతుకు పాలు పిండుతున్నారని వలసపాలకుల మీద సెటైర్లు వేసే వారు… ప్రస్తుతం తెలంగాణలో కూడా… అదే ఫాలో అవుతున్నారు. గదే దొర చెబితే ఆచరిస్తున్నారు. నిజంగా నా ఫాం హౌస్ లో దున్నపోతులు పాలు ఇస్తున్నాయని దొర చెప్పంగానే నిజంగా మన దొర అంతటి ఘటికుడేనని కితాబులుస్తున్నారు. ఇదిలా వుంటే ప్రస్తుత కరోనా మహమ్మారి కబళించిన వేళ ఏం జరుగుతున్నదో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది…
వాస్తవాలు బయటకు వస్తున్నాయా…
కరోనా ఎంత మందికి సోకింది.. ఎవరి వల్ల విస్తృతమైంది.. వారినేమైనా కట్టడి చేస్తున్నారా… ఏం చర్యలు తీసుకుంటున్నారు… వాస్తవాలు బయటకు రావడం లేదు… కేవలం లాక్ డౌన్ ప్రకటించేసి చేతులు దులుపుకోవడమేకాదు.. ఆత్మగౌరవ తెలంగాణ బిడ్డలను 15 వందలు అడుక్కుతినే వారిని తయారుచేసింది. ప్రసుతం ఏం జరుగుతున్నదో కూడా ఇళ్ళల్లో వున్న తెలంగాణ ప్రజలకు అంతుబట్టడం లేదు. మీడియా కూడా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం లేదు.. పాలకుల చెక్క బజనలు తప్ప, ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను ఏకరువు పెట్టడంలేదు. సోకాల్డ్ మేదావులు కూడా సోమరిపోతుల్లా తయారై, గాలి కబుర్లతో కాలం వెళ్ళ దీస్తున్నారు. నిజంగా కరోనా పై వాస్తవాలు బయపెడితే, తమ ఓట్లకు, సీట్లకు ఎసరు వస్తుందనుకొని బయట పెట్టడంలేదా… తానే తందానా బ్యాచ్ తో గొప్పలు చెప్పించుకోవడమేనా… ప్రజలు ఏమైనా పర్వాలేదా…
ప్రభువులు నీరో చక్రవర్తి చరిత్ర చదివాడా….
రోమ్ నగరం తగలబడి పోతుంటే, నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుక కూర్చున్నాడట. అదేవిదంగా ప్రస్తుత కరోనా కాలంలో కూడా అదే నడుస్తున్నదనిపిస్తున్నది. దేశంమంతా లాక్ డైన్ నడుస్తుండగా, ఒక్క పాత బస్తీలోనే ఎందుకు ఆ సడలింపులు… తెలంగాణ సమాజం మొత్తం కరోనా పై యుద్దం చేస్తుంటే, పాత బస్తీ అందుకు మినహాయింపుగా కొనసాగుతున్నది. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులు, జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి కరోనా పోరాటంలో యుద్ద సైనికులుగా పాల్గొంటున్నారు. తెలంగాణ యావత్ సమాజం సహకరిస్తున్నారు. కాని పాత బస్తీలో ఏం జరుగుతుందో కూడా తెలిసీ పట్టించుకోని వాడిని ఏమనాలి. నేరం చేసినవాడు నేరస్తుడైతే.. అది చూసి కూడా పట్టించుకోనివాడుకూడా నేరస్తుడే… పాతబస్తీలో జరుగుతున్న తతంగాన్ని చూసీకూడా పట్టించుకోని వాడు కూడా నేరస్తుడే… అక్కడ సామాజిక దూరం వుండదు, నిరంతంరం గుంపులుగుంపులుగా తిరగడం, ప్రభుత్వ ఆదేశాలను భేఖాతర్ చెయ్యడం జరుగుతున్నది. ఇదేమిటని పోలీసులు ప్రశ్నిస్తే వారిపై దాడులు కూడా చేస్తున్నారు. ఇలాగైతే కరోనా కట్టడి సాద్యమవుతుందా… పాత బస్తీలో జరుగుతున్న తంతంగం ప్రభుత్వ పెద్దలకు తెలిసీ కూడా పట్టించుకోకపోడంలో ఆంతర్యమేంటో అర్ధం చేసుకోవచ్చు. ఇలాగే కొనసాగితే కరోనా కట్టడి కష్టతరమే… అసలు కరోనా మహమ్మారి వచ్చింది ఎవరి వల్ల, ఎవరివల్ల విస్తృతమైంది, ఈ నిజాలు బయటకు రావాలి. డిల్లీలో జరిగిన ఓ మత పరమైన సంస్థ నిర్వహించిన సదస్సు వల్ల, అక్కడ పాల్గొని వచ్చిన వారి వల్ల కరోనా ఎక్కువగా ప్రభలిందని పెద్దలే స్వయంగా సెలవిచ్చారు. అలాంటి పరిస్థితి వుంటే పాత బస్తీకి మాత్రం ఆ మిహాయింపులెందుకు… హైదరాబాద్ నగరాన్ని ఏం చెద్దామనుకుంటున్నారు. ఇంకా తెలంగాణ సమాజాన్ని అడుక్కు తినేవారిలా తయారు చేసేందుకేనా ఈ ప్రయత్నం. వ్యాది ఇంకా ప్రభలితే ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. తెలిసీ కూడా పట్టించుకోవడం లేదంటే, రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకు పోదల్చుకున్నారో అర్ధం కాని పరిస్థితి. పాత బస్తీని కట్టడి చెయ్యక పోతే కరోనాను నిర్మూలించడం సాద్యంకాదు.
తిరుగుబాటు తప్పదా…. ఆత్మహత్యే శరణ్యమా…
ఇక్కడ నిజంగా రోమ్ నగర చివరి చక్రవర్తి చరిత్ర గుర్తుకు వస్తున్నది. నిజంగా నీరో అనబడే వాడు చక్రవర్తుల కుటుంబానికి చెందిన వాడుకాదు. అతన్ని రోమ్ చక్రవర్తులు దత్తత తీసుకున్న దత్త పుత్రుడు. దత్తత తీసుకున్న వారినే హత్య చేసిన హంతకుడు. సగం రోమ్ నగరాన్ని తగల బెట్టించిన కరుడు గట్టిన కాలాంతకుడు. చివరి చక్రర్తిగా ఎన్నుకోబడగానే ప్రజలను, పాలనను మరిచిపోయి వికృత పాలనను కొనసాగించాడు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారిని చంపడమే.. లేక, నయాన్నో భయాన్నో వారిని లొంగదీసుకోవడం ఆయనకు అలవాటు. అలా ఎన్ని తిరుగుబాట్లు వచ్చినా లెక్క చెయ్యకుండా, రోమ్ నగరాన్ని తగల బెట్టి ఫిడేలు వాయించుకు కూర్చున్నాడు. ఇదేమిటని ప్రశ్నించిన మేధావులను ఉరితీయించాడు. చివరకు క్రీ. శ 68 లో గౌలీష్ భూభాగంలోని గల్లియా లుగ్డునెస్సిస్ గవర్నర్ విండెక్స్ తిరుగుబాటు చేశాడు. అతనికి అన్ని వర్గాలు మద్దతు పలికాయి. తిరుగుబాటు ఉదృతం కావడంతో రోమ్ నగర చివరి చక్రవర్తి అయినటువంటి నీరో చక్రవర్తి రోమ్ నుంచి పారిపోయాడు. ప్రజా శత్రువుగా మారానని గ్రహించిన నీరో క్రీ. శ 68, జూన్ 9న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆతని ఆత్మహత్యతో అతని రాజవంశమే ముగిసింది. నీరో చక్రవర్తిలాగే ఇక్కడ కొనసాగుతున్నదని పిస్తున్నది. ఒక వైపు కరోనా మహమ్మారి ప్రభలుతున్నదని తెలిసినా కూడా, పాలకులు కొన్ని ప్రాంతాలను గాలికి వదిలేశారు. నీరో చక్రవర్తి చరిత్ర ఇక్కడ పునరావృతమవుతుందా…. నీరో చరిత్ర… తెలంగాణ పాలన చూసి మీరే డిసైడ్ చెయ్యండి. పోలికలు వున్నాయా.. లేదా మీరే తెల్చండి… ఇప్పటికైనా హైదరాబాద్ ను రక్షించుకునేందుకు తెలంగాణ ఆత్మ గౌరవ బిడ్డలుగా నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా వుంది….