గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది హేమచంద్ర, శ్రావణ భార్గవిల విడాకుల గురించే.. అసలైన వారి కంటే విషయం గురించి చెప్పేవారికే బాధ ఎక్కువ అయిపోయింది. నిన్న కాక మొన్న విడాకులు తీసుకున్న నాగ చైతన్య- సమంత, ధనుష్- ఐశ్వర్య, అమిర్ ఖాన్- కిరణ్ రావుల గురించి ప్రస్తావిస్తూ వీరిని కూడా అందులో కలిపేస్తున్నారు..
అయితే దీనిపై తాజాగా హేమచంద్ర-శ్రావణ భార్గవి ఇద్దరూ కూడా స్పందించి ఓ క్లారిటీ ఇచ్చారు.
“నా ఇండిపెండెంట్ సాంగ్స్ కంటే కూడా స్టుపిడ్ మరియు అనవసరమైన సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. నా ఇంస్టాగ్రామ్ బయోలో ఓ ఇండిపెండెంట్ లవ్ సాంగ్ ఉంది దాన్ని వీక్షించండి అంటూ హేమచంద్ర పేర్కొన్నాడు.
అలాగే శ్రావణ భార్గవి ఈ విషయం పై స్పందిస్తూ.. కొద్దిరోజులుగా నా యూట్యూబ్లో వ్యూస్ పెరిగాయి, ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఇప్పుడు నాకు ఎక్కువ పని దొరుకుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా సంపాదిస్తున్నాను. ఇది ఒకరకంగా శుభ పరిణామం… తప్పో ఒప్పో మీడియా అనేది ఒక ఆశీర్వాదం” అంటూ పేర్కొంది. మొత్తంగా పరోక్షంగా ఈ వార్తలు అబద్దాలు అన్నట్టు ఈ స్టార్ సింగర్స్ రాసుకొచ్చారు.
ఏది ఏమైనప్పటికీ వీరిద్దరూ ఓ క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇకనైనా వారి మీద వచ్చే పుకార్లు ఆగుతాయో లేదో చూడాలి.