పెళ్లిసందD సినిమా ఎవ్వరికీ కలిసిరాలేదు. అదొక పెద్ద ఫ్లాప్. కానీ ఒకే ఒక్కరికి మాత్రం ఆ సినిమా బ్రహ్మాండంగా కలిసొచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీలకు మాత్రం బాగా ప్లస్ అయింది. సి-సెంటర్లలో పెళ్లిసందడి సినిమా ఓ మోస్తరుగా ఆడిందంటే దానికి కారణం శ్రీలీల అందాలే.
అలా పెళ్లిసందడితో మెరిసిన ఈ ముద్దుగుమ్మ, ఆ వెంటనే రవితేజ హీరోగా వస్తున్న ధమాకా సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో క్రేజీ ప్రాజెక్టులోకి ఎంటరైంది. రౌడీబాయ్స్ హీరో ఆశిష్ హీరోగా రాబోతున్న రెండో సినిమాలో శ్రీలలను హీరోయిన్ గా తీసుకున్నారు.
దిల్ రాజు బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సుకుమార్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సుక్కూ శిష్యుడు కాశీ విశాల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సుకుమార్ ఈ సినిమాకు స్వయంగా డైలాగ్స్ అందించబోతున్నాడు. ఈ సినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ పెట్టారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో నటించే అవకాశం అందుకుంది శ్రీలీల.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ నెలలోనే ప్రాజెక్టు అధికారికంగా లాంఛ్ అవుతుంది.