మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం మరో హీరోయిన్ ను లాక్ చేశారు. తాజాగా శ్రీలీలను తీసుకున్నారు.
పెళ్లిసందD సినిమాతో పాపులర్ అయింది శ్రీలీల. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ శ్రీలీల అందచందాలకు మంచి పేరొచ్చింది, ఆమెకు గిరాకీ పెరిగింది. దీంతో ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు వచ్చి వాలాయి. వీటికి అదనంగా ఇప్పుడు మహేష్ బాబు మూవీ కూడా శ్రీలీల ఖాతాలో చేరింది.
అయితే ఈ ప్రాజెక్టులో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాదు. త్రివిక్రమ్ సినిమా ఏదైనా అందులో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఉండాల్సిందే. మహేష్ మూవీలో కూడా పూజానే హీరోయిన్. శ్రీలీలను సెకెండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.
త్రివిక్రమ్ సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ రోల్స్ అన్నీ బిస్కెట్లే. ఈ నేపథ్యంలో తాజా చిత్రంలో శ్రీలీల లాంటి అప్ కమింగ్ స్టార్ కు త్రివిక్రమ్ ఎలాంటి పాత్ర ఇచ్చాడనేది ఆసక్తికరంగా మారింది.
డిసెంబర్ 8 నుంచి ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కొత్త సినిమా అని ఎందుకు అంటున్నామంటే, ఇంతకుముందు అనుకున్న కథ వేరు, ఇప్పుడు కథ వేరు. ఫస్ట్ షెడ్యూల్ లో తీసిన సీన్స్ అన్నీ పక్కనపడేసి, 8వ తేదీ నుంచి కొత్తగా షూట్ మొదలుపెడుతున్నారు. అదన్నమాట సంగతి.