పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల తారాజువ్వలా దూసుకుపోతోంది. ఇప్పటికే వరుసపెట్టి అవకాశాలు అందుకున్న ఈ చిన్నది తాజాగా మరో సినిమా ఛాన్స్ కొట్టేసింది. హీరో నవీన్ పొలిశెట్టి సరసన నటించబోతోంది శ్రీలీల.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు నవీన్ పొలిశెట్టి. దీనికి అనగనగా ఒక రాజు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ ఎనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ ఫన్నీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడీ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈ సినిమా కోసం శ్రీలీల కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూరనేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ, శ్రీలీలకు కోటి రూపాయలు ఆఫర్ చేసినట్టు టాక్.
ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ సరసన ధమాకా అనే సినిమా చేస్తోంది. మరోవైపు బాలకృష్ణ సినిమాలో అతడికి కూతురిగా నటించే అవకాశం అందుకుంది. వీటితో పాటు మరో 3 సినిమాలకు కూడా ఆమె కాల్షీట్లు కేటాయించింది. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి సినిమా కూడా శ్రీలల ఖాతాలోకే చేరింది.