క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టి విభిన్నమైన కథలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు. ఇప్పుడిప్పుడే మెల్లగా ఫామ్ లోకి వస్తున్న ఈ హీరో ఈ ఏడాది బ్రోచేవారెవరు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. హిట్ కొట్టిన వెంటనే ఫ్లాప్ కూడా మూటగట్టుకున్నాడు. తిప్పరా మీసం సినిమా తో డీలా పడ్డాడు. హిట్ ఫ్లాప్ లను పక్కన బెట్టిన శ్రీవిష్ణు కాన్సెప్ట్ సినిమాలు తీసేందుకు సిద్దమవుతున్నాడు.
హసిత్ గోలి అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు శ్రీవిష్ణు . ఈ సినిమా వచ్చే ఏడాది రెండో భాగంలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.