క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కెరాఫ్ అడ్రెస్ గా నిలిచిన హీరో శ్రీ విష్ణు. హీరోగా చేస్తూనే ప్రొడ్యూసర్ గా మారిన శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ సినిమా తిప్పరా మీసం. ఇప్పటివరకూ లవ్ అండ్ ప్రయోగాలు మాత్రమే చేసిన శ్రీ విష్ణు, ఈ మూవీతో యాక్షన్ మోడ్ లోకి దిగుతున్నాడు. న్యూ ఏజ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని కృష్ణ విజయ్ డైరెక్ట్ చేశాడు. గతంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన అసుర సినిమాని డైరెక్ట్ చేసిన కృష్ణ విజయ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అసుర అయ్యాక మూడేళ్ళ పాటు వెయిట్ చేసి తిప్పరా మీసం కథని సిద్ధం చేసిన కృష్ణ విజయ్, గతేడాది ఈ మూవీని అనౌన్స్ చేశాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే శ్రీ విష్ణు అండ్ తిప్పరా మీసం రెండూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. రిలీజ్ సమయం దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. టీజర్ ట్రైలర్ లో లైట్ గా చూపించిన అండర్ వాటర్ లో తీసిన యాక్షన్ సీన్ తిప్పరా మీసం సినిమాకే హైలైట్ గా ఉంటుందని, తెలుగులో ఇప్పటివరకూ ఇలాంటి సీన్ రాలేదని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. యాక్షన్ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది అంటే, సినిమాలో ఎంత రివెంజ్ డ్రామా ఉన్నా కూడా దాన్ని ప్యాడింగ్ చేసే కథ తప్పకుండా ఉండి ఉంటుంది. ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తున్న తిప్పరా మీసం సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి యాక్షన్ మోడ్ లో శ్రీ విష్ణు అండ్ టీం ప్రేక్షకులని ఎంత వరకూ మెప్పిస్తారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.