కెరీర్ లో దూసుకుపోతున్న శ్రీలీల మరో బంపరాఫర్ కొట్టేసింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. అవును.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది.
పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా మారింది శ్రీలీల. ఆ సినిమాలో ఆమె లుక్స్, డాన్స్ కు టోటల్ టాలీవుడ్ ఫిదా అయింది. వరుసపెట్టి ఆఫర్లు ఇచ్చింది. ఈ క్రమంలోనే ధమాకాతో మరో బిగ్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. దీంతో పవన్ సరసన ఆఫర్ వచ్చేసింది.
నిజానికి ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. హరీశ్ శంకర్ కు లక్కీ హీరోయిన్ ఆమె. కానీ, పవన్ సినిమాకు కాల్షీట్లు ఇవ్వడానికి పూజా నిరాకరించింది. ప్రస్తుతం తన వద్ద అన్ని కాల్షీట్లు లేవని స్పష్టం చేసింది.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీలీలను తీసుకున్నారు. త్వరలోనే పవన్-శ్రీలీలతో ఫొటోషూట్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.