తెలుగు, కన్నడ భాషల్లో కలిపి శ్రీలల చేతిలో ఏకంగా 8 సినిమాలున్నాయి. వీటిలో బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , నితిన్, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాలున్నాయి. అయితే తను చేసేవన్నీ గ్లామర్ రోల్స్ అనే విషయాన్ని అంగీకరించింది శ్రీలీల. ఈ విషయంలో తనకు ఎలాంటి కంప్లైట్స్ లేవంటోంది. హీరోను చూసే టికెట్ కొంటారని ఓపెన్ గా చెబుతోంది.
“నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఎవరైనా హీరోను చూసే సినిమా టికెట్ కొంటారు. నేను కొత్త వ్యక్తిని, కాబట్టి పాత్రల విషయంలో నేను రూల్స్ పెట్టుకోలేను. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి దృష్టిని ఆకర్షించడం నా విధి. అందుకే కథకు ఎంటర్ టైన్ మెంట్స్ జోడించే పాత్రలను మాత్రమే చేస్తున్నాను. అలాంటి పాత్రలు పోషిస్తున్నందుకు నాకు ఇబ్బందిగా లేదు.“
అయితే తను పోషించేవి కమర్షియల్ పాత్రలే అయినప్పటికీ, వాటిలో కూడా కాస్త కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతోంది శ్రీలీల. లుక్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతోంది. ప్రస్తుతం తనకు కెమెరా ఓ వ్యసనంగా మారిందని అంటోంది శ్రీలీల.
శ్రీలల తల్లి డాక్టర్. కాబట్టి తనను బలవంతంగా డాక్టర్ ను చేసే ప్రయత్నం జరగలేదంటోంది శ్రీలీల. తనకు కూడా వైద్య వృత్తి అంటే ఇష్టమని, అందుకే ఇంత బిజీగా ఉంటూ కూడా మెడిసిన్ సిలబస్ వదలడం లేదని చెబుతోంది.