అందాల శ్రీముఖి పెళ్ళికూతురు కాబోతోందా?! పెళ్ళి బాజా మోగించ బోతోందా?! తనదైన మాస్ జోష్ తో కుర్రకారును రెచ్చగొట్టే రచ్చరావులమ్మ శ్రీముఖి ఓ ఇంటిది కాబోతోందని వార్తలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అందాల భామ తన గ్లామర్ పిక్స్ ని షేర్ చేస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతుంటుంది. తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఒక న్యూస్ పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది.
ఒక బడా బిజినెస్ మేన్ తో ఆమె జీవితాన్ని పంచుకోబోతోందని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు కుటుంబాలు వివాహం గురించి మాట్లాడుకున్నాయని… ముహూర్తాన్ని ఫిక్స్ చేయడమే మిగిలిందని చెపుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
మరోవైపు బొద్దుగా ఉండే శ్రీముఖి ఈమధ్య సన్నబడిన సంగతి కూడా తెలిసిందే. పెళ్లి కోసమే ఆమె నాజూకుగా తయారయిందని చెపుతున్నారు. మరి ఈ పెళ్లి వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.