బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాలిటీ షో బిగ్ బాస్. మూడవ సీజన్ ముగిసి నెల రోజులకు పైగా అవుతున్న ప్రేక్షకులు మాత్రం హౌస్ లోని కంటెస్టెంట్లు పై నిత్యం చర్చించుకుంటున్నారు. ఇక ముఖ్యంగా హౌస్ లో రాహుల్, పునర్నవిలా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియా కోడై కూసింది. ఇదంతా ఒకెత్తు అయితే హౌస్ లో శ్రీముఖి రాహుల్ మధ్య గొడవలు ఒకెత్తని చెప్పాలి. హౌస్ లో విన్నర్, రన్నర్ గా నిలిచిన ఈ ఇద్దరు ఒకపై ఒకరు చాలా సార్లు అరుచుకున్నారు. బయటకు వచ్చాక నీ ముఖం కూడా చూడను నీతో మాట్లాడనంటూ వాదించుకున్నారు.
మరో సారి పోలీస్ ఆఫీసర్ గా శివమణి
ఈ విషయమై అటు రాహుల్ ఫ్యాన్స్, శ్రీ ముఖి ఫ్యాన్స్ కూడా ఇక వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా రాహుల్ శ్రీముఖీలు కలిసి దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. వారిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటోను రాహుల్ పోస్ట్ చేస్తూ గతం గతః అసలు రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది అంటూ రసుకొచ్చాడు. శ్రీ ముఖి కూడా ఇదే ఫోటో ని పోస్ట్ చేసింది. గతంలో అన్ని తిట్టుకున్న వీరు ఇప్పుడు ఇలా కలవటం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
భార్య భర్తల మధ్య వివాదం..ముగ్గురు మృతి