శ్రీముఖి ఈ పేరు బుల్లితెరప్రేక్షకులకు పెద్దగా చెప్పనవసరం లేదు. అయితే ఈ అమ్మడును పటాస్ షో ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. రేటింగ్స్ లో కూడా పటాస్ షో నిలిచిందంటే కారణం లేకపోలేదు. ముఖ్యంగా రవి, శ్రీముఖి కెమిస్ట్రీ అనేది పెద్దగా చెప్పనవసరం లేదు. ఉన్నట్టుండి పటాస్ షో నుంచి శ్రీముఖి తప్పుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ షో కి వెళ్లిన శ్రీముఖి కి మరింత ఆదరణ పొందిందనే చెప్పాలి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీముఖి మళ్ళీ పటాస్ షో చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ శ్రీముఖి ఇచ్చిన సమాధానం సంచలనం రేపింది. రవి తో యాంకరింగ్ చెయ్యాలంటే మా నాన్నని అడగాలంటూ చెప్పింది. ఇప్పుడు రవి కూడా పటాస్ షో నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలో చలాకి చంటి, వర్షిణిలు చేస్తున్నారు. అప్పటికన్నా రేటింగ్స్ కూడా తగ్గినట్టు తెలుస్తుంది. ఇలానే ఉంటె పటాస్ షో నడిచేపరిస్థితి ఉండదని, కాబట్టి శ్రీముఖి ని తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నారట షో నిర్వాకులు.
రవి ఉంటె యాంకరింగ్ చెయ్యటం కష్టం అని భావిస్తున్న శ్రీముఖి.. రవి లేడు కాబట్టి పటాస్ షో కు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరో వైపు చలాకి చంటికి శ్రీముఖి కి మంచి ర్యాపొ ఉండటం తో ఖచ్చితంగా ఈ ఇద్దరు కెమిస్ట్రీ స్క్రీన్ పై పండుతుందని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో గుస గుస లాడుకుంటున్న ఈ విషయంలో ఎంత నిజం ఉందొ తెలియాలి అంటే దీనిపై ఎవరో ఒకరు స్పందించాల్సిందే.