ఐపీఎల్-2022 తొలి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా.. భారీ పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్-2022కు స్వాగతం పలికింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది సన్‌రైజర్స్ టీమ్. కానీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ టీంకి దారాళంగా పరుగులిచ్చుకున్నారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 61 పరుగుల భారీ తేడాతో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఐపీఎల్ తాజా సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదిక మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ జరిగింది. మొదట బ్యాంటింగ్ చేసిన రాజస్థాన్ అదరగొట్టింది. తన ఐపీఎల్ కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడుతోన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 27 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టు స్కోరు భారీగా పెంచారు. ఇక పడిక్కల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. 29 బంతుల్లో 41 పరుగులు చేశారు. ఇక ఓపెనర్ జోస్ బట్లర్ 28 బంతుల్లో 35 పరుగులు చేయగా.. చివర్లో హెట్ మైర్ 13 బంతుల్లో 32 పరుగులతో సూపర్ ఫినిష్ ఇచ్చారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు కదల్లేదు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ బ్యాటర్లు.. రాజస్థాన్ జట్టు నిర్దేశించిన 211 భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డారు. కెప్టెన్ మొదలు.. టాప్ బ్యాట్స్‌మెన్ అందరూ సింగిల్ డిజిల్ స్కోర్‌కే పరిమితం అయ్యారు. ఆరవ ప్లేస్‌లో వచ్చిన ఐడెన్ మార్క్రామ్ 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. వాషింగ్టన్ సుందర్ 40, షెపార్డ్ 24 ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ టీమ్.. 149 పరుగులు మాత్రమే చేసింది.
రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లు, బౌల్ట్, ప్రసిద్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బంతులు వేసిన బౌలర్‌గా భువనేశ్వర్ అగ్రస్థానంలో నిలిచారు. తాజాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు. కాగా ఇందులో 12 డాట్‌బాల్స్ ఉండడం విశేషం.
ఇక ఐపీఎల్‌లో భువనేశ్వర్ ఇప్పటివరకు 133 మ్యాచ్‌ల్లో 1338 డాట్ బాల్స్ వేసి అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో హర్భజన్ సింగ్ 163 మ్యాచ్‌ల్లో 1314 డాట్ బాల్స్‌తో రెండో స్థానంలో.. రవిచంద్రన్ అశ్విన్ 167 మ్యాచ్‌ల్లో 1293 డాట్ బాల్స్‌తో మూడో స్థానంలో ఉన్నారు.