శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. దేశంలో పరిస్థితికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమంటూ నిరసనకారులు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసన కారులు ఆయన ఇంటి ఎదుట గురువారం నిరసనలకు దిగారు. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చాలా మంది నిరసనకారులు గాయపడ్డారు. దీంతో రాజపక్సే ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నందు వల్ల దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు అధ్యక్షుడు రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. దీంతో దేశంలో కఠిన చట్టాలను అమలు చేయనున్నారు.
ప్రజా రక్షణ, శాంతి పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణకు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎమర్జెన్సీ నేటి నుంచి శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని గెజిట్ లో తెలిపారు.