శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకి మరింత ముదురుతోంది. అది కాకుండా విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో పెట్రోల్ , డీజిల్ దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం, పెట్రోలియం సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా 22 శాతం పెంచేసింది.
దీంతో అక్కడి కరెన్సీ ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధర రూ.550కు, డీజిల్ ధర రూ.460కి చేరాయి. అసలే ఆర్థిక సమస్యలతో కకావికలం అవుతున్న పేదలు, మధ్య తరగతి వారిపై ఇది మరింత భారం మోపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో.. చాలా మంది ప్రజలు బంకుల ముందు క్యూలలో వాహనాలు పెట్టేసి వెళ్లిపోతున్నారు. ఎప్పుడైనా పెట్రోల్, డీజిల్ రాగానే వాహనాల్లో పోయించుకోవచ్చని అలా చేస్తుండటం గమనార్హం.
సరైన సమయంలో చమురు అందక..
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక… విదేశాల నుంచి చేసుకునే దిగుమతులకు డబ్బులు చెల్లించలేకపోతోంది. భారత్ సహా వివిధ దేశాలు అందిస్తున్న రుణాలు, ఆర్థిక సాయంతో నెట్టుకొస్తోంది. కొద్దికొద్దిగా చమురు దిగుమతులు జరుగుతున్నాయి. కానీ దిగుమతులు ఆలస్యం అవుతుండటంతో ధరలు పెంచాల్సి వచ్చిందని శ్రీలంక చమురు మంత్రిత్వ శాఖ మంత్రి కాంచన విజేశేఖర తెలిపారు.
ధరలు పెంచడం, కొరతపై ప్రజలకు క్షమాపణ చెప్పారు. వాహనదారులెవరూ బంకుల ముందు క్యూలు కట్ట వద్దని విజ్ఞప్తి చేశారు.
శ్రీలంక తగిన సాయం చేస్తామన్న అమెరికా
ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు సాయం చేయాలన్న విజ్ఞప్తి మేరకు అమెరికా ఆర్థిక, విదేశాంగ శాఖల అధికారులు శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ‘‘శ్రీలంక చరిత్రలోనే దారుణమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ దేశానికి ఏమేం అవసరమో, ఎలాంటి సాయం చేస్తే బాగుంటుందనే అంశాలను అమెరికా బృందం పరిశీలిస్తోంది. ఆర్థిక వృద్ధికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి తగిన సాయం అందించడంపై దృష్టి పెడుతున్నాం” అని శ్రీలంక రాజధాని కొలంబోలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.
సజైఔస\
ఐపజ.,ఇటు అమెరికా బృందం పర్యటిస్తున్న సమయంలోనే అటు శ్రీలంక ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం గమనార్హం.