ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హీరో నాని ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. థియేటర్ కలెక్షన్స్ కన్నా కిరాణా షాప్ కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నాని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని మాట్లాడుతూ సినిమాలు మానేసి కిరాణా కొట్టే పెట్టుకోవాలంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. కాగా తాజాగా సినీ నటి శ్రీరెడ్డి నాని వ్యాఖ్యలపై స్పందించారు.
నాని.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. టిక్కెట్స్ రేట్స్ తగ్గిస్తే.. ప్రేక్షకులను అవమానపరిచినట్టు ఎలా అవుతుందని థియేటర్స్ విషయంలో నానికి నిజంగానే బాధ అనిపిస్తే V, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీ విడుదల సమయంలో థియేటర్స్ యజమానులను ఎందుకు కించపరిచారో చెప్పలని డిమాండ్ చేశారు. గతంలో కూడా శ్రీరెడ్డి నాని పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి