సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే శ్రీరెడ్డి మరోమారు దుమారం రేపింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీ రెడ్డి ఈ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వైపుకు తిరిగింది. ముఖ్యమంత్రిగా జగన్ సిన్సియర్ గా పరిపాలిస్తున్నారని, అతనికి ఎవరైనా అడ్డు వస్తే మర్డర్ చేసి జైలుకి వెళ్తానంటూ రాసుకొచ్చింది. ఇంకో కామెంట్ లో జగన్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే నాకు తట్టుకోలేనంత కోపం వస్తుందంటూ చెప్పుకొచ్చింది. దానికి నెటిజన్లు ఎవరి అభిప్రాయాలను వారు షేర్ చేసుకుంటున్నారు.ఇటీవలే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే…