వివాదాస్పద నటి శ్రీరెడ్డి గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్నారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పై తనదైన స్టైల్లో విరుచుకుపడింది. ఎందుకో తెలుసా ఇటీవల సమంత ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. అందుకు సంబంధించి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలను చూసిన శ్రీ రెడ్డి అక్కినేని ఫ్యామిలీలో అమల గారు ఎంత మంచిగా డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆమె యంగ్ గా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది. ఇక నాగార్జున విషయానికి వస్తే నాకు నచ్చరు . అది వేరే విషయం. కానీ ఓ ఫ్యాన్ గా నీ డ్రెస్సింగ్ సెన్స్ నాకు నచ్చడం లేదంటూ సమంతపై మండిపడింది. మహేష్ భార్య నమ్రత ను చూసి నేర్చుకో. మహేష్ సక్సెస్ కావడం లో ఆమె పాత్ర ఎంతో ఉంది.
నీ భర్త పరిశ్రమలో పెద్దగా సక్సెస్ కాలేదు. అతనికి నువ్వు చూసుకోవచ్చు కదా అంటూ సలహా ఇచ్చింది. ఇలాంటి బట్టలు వేసుకోవడం వలన ఏమైనా సెక్సీగా కనిపిస్తున్నావా అంటే అదీ లేదు. నీవు సెక్సీ కాదు సమంత. విప్పిచూపించినా ఎవరూ చూడరు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. నువ్వు తమిళ అమ్మాయివి. కానీ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి అయ్యాక లిమిట్ క్రాస్ చేస్తున్నావు. నాగచైతన్య లైఫ్ మీద అతని సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టండి అంటూ శ్రీరెడ్డి కామెంట్ చేసింది.