వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కింది. ఎప్పుడు ఎవర్నో ఒకరిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించే శ్రీరెడ్డి ఈసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేసింది. ఆల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బన్నీ కనిపించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలను గుప్పించింది. అయితే ఎప్పుడు మనుషులను టార్గెట్ చేస్తూ పోస్టులను పెట్టె శ్రీరెడ్డి… ఈ సారి మాత్రం రొటీన్ కు భిన్నంగా అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ పై సెటైర్ వేసింది.
అల్లు అర్జున ఎప్పటికైనా నీ ఒరిజినల్ హెయిర్‌తో సినిమాల్లో వస్తావా.. ఎప్పుడూ ఎక్స్‌టెన్షన్ విగ్గులేనా.. అంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఈ పోస్టు వైరల్ అవ్వడంతో ఆమెపై బన్నీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటావా… నీకేమి పని లేదా అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎప్పుడు నోరు పారేసుకోవడమే నీకున్న పనా అంటూ కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. అయితే బన్నీపై శ్రీరెడ్డి కామెంట్స్ చేయడం ఇది మొదటి సారి కాదండోయ్.. ఇదివరకు కూడా బన్నీపై వివాదాస్పద పోస్టులను పెట్టింది.