తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలంటూ మరోసారి సినీనటి శ్రీ సుధ పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. పేరు ప్రముఖ కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీ సుధ ఫిర్యాదు చేశారు. గతంలో పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
గతేడాది మే 26న తనతో సహజీవనం చేసి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని శ్రీ సుధ ఫిర్యాదు చేసింది. అప్పట్లో శ్యామ్ కె నాయుడు పై పోలీసులు కేసు నమోదు చేశారు.