డిఫ్రెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో శ్రీవిష్ణు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వచ్చిన బాణం సినిమాతో శ్రీవిష్ణు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాదీ ఒకటే కథ వంటి సినిమాలు శ్రీవిష్ణు కు మంచి పేరును తీసుకొచ్చాయి.
తాజాగా శ్రీవిష్ణు తన కొత్త సినిమాను ప్రారంభించాడు. అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. నారా రోహిత్ క్లాప్ కొట్టి ఈ సినిమాను ప్రారంభించారు. ప్రదీప్ వర్మ అల్లూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ను శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.