అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధడక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే జాన్వీ కపూర్ ఇటీవల ముంబైలోని ఖరీదైన ఏరియా జుహు లో ఓ ఇల్లు కొందట. ఏకంగా 39 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఖరీదైన ఇంటిని కొందట.
ముంబై లోని జుహు లో కేవలం స్టార్స్ కి మాత్రమే ఇల్లు ఉంటాయి. అలాంటి ఖరీదైన ప్రాంతంలో జాన్వీ ఇప్పుడే ఇల్లు కొందంటే అంటే ఆమె రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో తీసుకుంటుందో అర్థమవుతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కొన్ని యాడ్ లకు అంబాసిడర్ గా కూడా చేస్తుంది జాన్వీ.