క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇదిలా ఉంటే చాలాకాలంగా విజయ్ దేవరకొండ మంచి స్టొరీ ఉంటే హిందీలో కుడా తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ‘ఫైటర్’తో హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు. దక్షణాదికి సంబదించి అన్ని బాషలలో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ నెల 20 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం ఈ యువ హీరో థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నాడు. ఫైటర్ సినిమాల్లోని ఎక్కువ సన్నివేశాలను ముంబైలో చిత్రీకరించనున్నారు. ప్రధానంగా మంచి లొకేషన్ ఏరియాలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనుంది.