శ్రీధర్ బాబు మాజీ మంత్రి, ఎమ్మెల్యే
లాక్ డౌన్ వల్ల ఇప్పటి వరకు చిన్న-మధ్యతరగతి పరిశ్రమలు ప్రతి రోజు 30వేల కోట్లు నష్టపోతున్నాయి. దేశంలో 35శాతం జీడిపి కి చిన్న-మధ్యతరగతి పరిశ్రమలు కంట్రిబ్యూటీ చేస్తున్నాయి. చిన్న-మధ్యతరగతి పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం 1లక్ష కోట్ల రూపాయలతో క్రెడిట్ గ్యారెంటీ ప్రకటించాలి. బ్యాంక్ ద్వారా కేంద్రం చిన్న-మధ్యతరగతి పరిశ్రమలను ఆదుకోవాలని సోనియాగాంధీ కోరారు. చిన్న-మధ్యతరగతి పరిశ్రమలను అదుకుంటే ఆర్థిక భారం కేంద్రం తప్పించునే అవకాశం ఉంటుంది. కేంద్రం ఈ సమయంలో అదుకుంటే 35 శాతం నుంచి 50 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఎమ్ఎస్ ఎమ్ ఈ కి కాంట్రిబ్యూటీ చేస్తున్న వారిలో 90 శాతం చిన్న-మధ్య తరగతి పరిశ్రమలే. స్టిమ్మిలేట్ ప్యాకేజి గురించి కేంద్రం స్పందించకపోవడం భాగాకరం. స్టిమ్మిలేట్ ప్యాకేజి గురించి వాళ్ళ బీజేపీ నేతలు మాట్లాడినా కేంద్రపెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు. ఈ ప్యాకేజి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం,ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించడం లేదు.
కేంద్రానికి లేఖలు రాసామని మాత్రమే చెప్పారు కానీ- తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్ సమయంలో టీఆరెస్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజి విషయంలో ఒక్క సమావేశం ఏర్పాటు చేసుకోలేదు. చిన్న-మధ్య తరగతి పరిశ్రమలను ఆదుకునే విదంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనలు చేయాలి. నితిన్ గత్కరి ప్రకటించిన స్టిమ్మిలేస్ ప్యాకేజి ఎందుకు 45 రోజులుగా ఆర్థిక శాఖలో పడివుందో చెప్పాలి. అమెరికా లాంటి దేశాలు స్పెషల్ ఎకానమీ ప్యాకేజీలు ప్రకటన చేసాయి. సోనియాగాంధీ రెండు సార్లు ప్రధాని కి లేఖ రాసిన స్పందన లేదు. కేంద్రం చిన్న-మధ్యతరగతి పరిశ్రమలను ఆదుకోవాలి.