శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వో నరసింహమూర్తికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఓ తోటలో ఉద్యోగులతో కలిసి మందుపార్టీ చేసుకుంటున్న నరసింహమూర్తి అక్కడే ఉన్న వైసీపీ నాయకులతో చిందులు వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో అధికారులు నరసింహమూర్తికి దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరో వైపు నర్సింహామూర్తి పై ఉన్న వ్యక్తిగత ఆరోపణలు పై శాఖాపరమైన విచారణ కూడా చేసే అవకాశం ఉందని తోటి కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇటీవల రైతుభరోసా కు సంబందించిన డబ్బులను ఎమ్మార్వో నరసింహమూర్తి పక్కదోవపట్టించాడని ఆరోపణలు కూడా ఉన్నాయి.