ప్రకాష్ రాజ్ ప్యానల్ డబ్బులు పంచుతోందంటూ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేష్ చేసిన కామెంట్స్ పై శ్రీకాంత్ స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని నాశనం చేయడానికేనా మీరు ఉందంటూ మండిపడ్డారు. మీరే డబ్బులు వేరే వాళ్లతో పంపించి.. ప్రకాష్ రాజ్ ఇచ్చాడు అని చెప్పదలుచుకున్నారా..? దయచేసి నరేష్ చెప్పే అబద్ధాలు నమ్మొద్దని సభ్యులకు సూచించారు.
దసరా సందర్భంగా పూజలందుకుంటున్న అమ్మవారి మీద ఒట్టేసి చెబుతున్నాం… ఇలాంటి కల్చర్ లెస్ పనులు తాము చేయమని చెప్పారు శ్రీకాంత్. ఏమైనా తేడా వస్తే.. ఆ అమ్మవారే తమని నాశనం చేస్తారని అన్నారు. ఇంకొన్ని గంటల్లో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు డబ్బులు పంచుతున్నామని వీడియో పెడతారా..? అసలు డబ్బులు పంచింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. లాస్ట్ టైమ్ కూడా ఇదే చేశారుగా అంటూ విమర్శలు చేశారు శ్రీకాంత్.