బాలయ్య, బోయపాటి కాంబో మూవీ బీబీ3 మూవీ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్యతో హ్యాట్రిక్ కొట్టాలని కసి మీదున్న బోయపాటి.. అందుకు తగ్గట్టే బాగానే కష్టపడుతున్నాడు. సింహ, లెజెండ్ మూవీలతో బాలయ్య రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లడంతో ఈ మూవీపైనా భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీలో విలన్ రోల్ ఎవరు చేస్తున్నారనే దానిపై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది.
బీబీ3లో జగపతి బాబు కూడా ఉన్నాడని తెలియడంతో తొలుత ఆయనే విలన్ అనుకున్నారంతా. కానీ బోయపాటి ఈ ప్రాజెక్ట్ కోసం మరో ఫ్యామిలీ హీరోని పవర్‌ఫుల్‌గా మార్చబోతున్నాడని తెలుస్తోంది. బీబీ3 ప్రాజెక్టులో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్యకు పోటీగా శ్రీకాంత నటిస్తాడా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. అయితే సాఫ్ట్ క్యారెక్టర్ జగపతిబాబునే కరుడుగట్టిన విలన్‌గా చూపించిన బోయపాటి.. శ్రీకాంత్‌నుకూడా నెగెటివ్ రోల్‌లో కచ్చితంగా నిలబెడతారని చెప్పుకుంటున్నారు.