శ్రీలంక మాజీ ఆల్ రౌండర్ రస్సెల్ ఆర్నాల్డ్ పుణెలోని ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. శుక్రవారం మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో ఇండియా-శ్రీలంక మధ్య జరగనున్న థర్డ్ టీ20 ఇంర్నేషనల్ మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆర్నాల్డ్ కామెంటరీ ప్యానెల్ లో ఉన్నారు.ఎయిర్ పోర్ట్ నుంచి తాను బస చేయాల్సిన హోటల్ కు వెళ్తుండగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. తాను ట్రాఫిక్ లో చిక్కుకున్న పోటో తీసి తన అఫీషియల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆర్నాల్డ్. రోడ్డు మధ్యలో ఉన్నాను. ఎక్కడి వెళ్లడానికి లేదని ట్వీట్ చేశారు. 20 సెకన్ల వీడియోను పోస్ట్ కూడా చేశారు. దీనిపై స్పందించిన ట్విట్టర్ యూజర్లు పుణెలో ట్రాఫిక్ జామ్ లు సాధారణమని కామెంట్ చేశారు.