కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన హిట్ సినిమా శ్రీమంతుడు. మహేష్ కెరియర్లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. అంతే కాదు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిన మొదటి సినిమా కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా !! శ్రీమంతుడు సినిమా వచ్చి నేటికీ ఐదేళ్లు. 2015 ఆగష్టు 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో మహేష్ కు జంటగా శృతిహాసన్ నటించింది.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కు జంటగా మహానటి ఫెమ్ కీర్తి సురేష్ నటిస్తుంది.