యాంకర్ శ్రీముఖి క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరంలేదు. హీరోయిన్ తరహాలో ఆమెకు అభిమానులున్నారు. అయితే ఫ్యాన్స్ తో తనకు చికొచ్చి పడినదంటున్నారు శ్రీముఖి. బిగ్ బాస్ షో తరువాత ఆమె ఏమాత్రం విరామం లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఆ మధ్య అభిమానుల కోలాహలంతో ఆమె తీరిక లేకుండా గడిపారు.
బిగ్ బాస్ రియాల్టీ షో తరువాత శ్రీముఖి పైవసీ లేకుండా పోతుందని వాపోయింది. అభిమానులు అప్పుడు పడితే అప్పుడు మా ఇంటికి వస్తున్నారని.. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో తెలుసుకోకుండానే ఫొటోల కోసం ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకొచ్చింది. తాను షూటింగ్ లో పాల్గొని వస్తుండగానే తన కోసం వేచి ఉన్నవారు సెల్ఫీ కోసం ఉరుకొస్తారని చెప్పింది. బిజీ షెడ్యూల్ ను ముగించుకొని రాగానే.. ఫోటోలు దిగాలంటే ఎలా సాధ్యం అవుతుందని శ్రీముఖి ఓ వీడియో ద్వారా ప్రశ్నించారు.
ఎలాంటి సమాచారం లేకుండా ఇంటికి వస్తే ఎలా అని ప్రశ్నించారు శ్రీముఖి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని కనుక ఒక్క ఫోటో అంటూ ఒత్తిడి చేస్తుంటారని చెప్పుకొచ్చింది. తాను ఓ టెలివిజన్ షోలో చేస్తున్నాని… ఒక్క రోజు రెండు మూడు ఎపిసోడ్ లు ముగించుకొని తిరిగి వచ్చేసరికి రాత్రి 3గంటలు అయిందని.. పొద్దునే లేచి మళ్ళీ షూటింగ్ వెళ్లాల్సిన సమయంలో ఫోటోలు దిగాలంటే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని శ్రీముఖి కోరారు. ఆ ఆసమయంలో నేను అవేవీ పట్టించుకోకుండా కారు ఎక్కి షూటింగ్ కు బయల్దేరానని తెలిపారు. ఎవరైనా తనను కలవాలని వచ్చేవాళ్ళు ముందస్తు సమాచారంతో వస్తే వాళ్లతో ఫోటోలు మాత్రమే కాకుండా.. కాసేపు ముచ్చటించే వీలుంటుందని అన్నారు. కానీ ఎలాంటి సమాచారం లేకుండా సెల్ఫీ అంటే ఎలా ఉంటుందని అభిమానులను ప్రశ్నించారు శ్రీముఖి. ఈ విషయం చెప్పడానికి కొంచెం బాధగానే ఉన్న తప్పడం లేదన్నారు. అందరు ఈ విషయాన్నీ అర్ధం చేసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు.