జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ముందే మొదలయ్యాయి. లాల్ చౌక్ దగ్గర ఉన్న ప్రసిద్ధ గడియార స్తంభం రాత్రి సమయంలో త్రివర్ణ పతాకంలో ప్రకాశిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను శ్రీనగర్ మేయర్ జునైద్ మట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు లాల్ చౌక్ వద్ద ఉన్న క్లాక్ టవర్ ను త్రివర్ణ రంగులతో ప్రకాశింపజేశామని.. సంబంధింత అధికారులను అభినందించారాయన.
We have illuminated the Clock Tower (‘Ghanta Ghar’) at Lal Chowk in colours of the Tricolour ahead of Independence Day. 🇮🇳
New clocks fitted.
Well done Team @SMC_Srinagar! pic.twitter.com/EKeFZX957o
— Mayor of Srinagar (@MayorofS) August 6, 2021
లాల్ చౌక్.. శ్రీనగర్ లో అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ మొదటిసారిగా జాతీయ జెండాను 1992లో పటిష్ట భద్రత నడుమ ఎగురవేశారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది క్లాక్ టవర్ దగ్గర సీఆర్పీఎఫ్ అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తున్నారు. అయితే గడియార స్తంభాన్ని ఇలా త్రివర్ణంతో వెలిగించడం మాత్రం ఇదే తొలిసారి.
శ్రీనగర్ టూరిస్ట్ స్పాట్ జీరో బ్రిడ్జ్ కూడా జాతీయ జెండా రంగులతో ప్రకాశిస్తోంది.