ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కెజిఎఫ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపించింది.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం కే జి ఎఫ్ పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులను శరవేగంగా చేస్తున్నారు మేకర్స్.
తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. కెజిఎఫ్ టైటిల్ ను తన చేతి వేళ్ళతో లవ్ సింబల్ గా చూపిస్తూ వెనుక నుంచి శ్రీనిధి శెట్టి ఇందులో కనిపించారు.
అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని ఏప్రిల్ 14న కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.