బీజేపీపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులవృత్తులను అవమానిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కానీ తెలంగాణలో కుల వృత్తులను కేసీఆర్ సర్కార్ కాపాడుతోందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో అన్ని కుల వృత్తులను అభివృద్ధి చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. గౌడ సోదరులను ఆదుకునేందుకు నీర పాలసీ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ఈత చెట్లను పెంచుకుంటున్నామని చెప్పారు.
4 కోట్ల 20 లక్షల ఈత మొక్కల్ని పెంచామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఉద్యోగుల కన్నా, తెలంగాణ ఉద్యోగులకే జీతాలు ఎక్కువగా అందుతున్నాయన్నారు. కేసీఆర్ సర్కార్‌కే ఇది సాధ్యమైందన్నారు.
ప్రభుత్వ దార్శనిక పాలన, కష్టపడి పని చేసే ఉద్యోగులు ఉండడం వల్లే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అనేక అంశాల్లో వరుస అవార్డులు అందుతున్నాయన్నారు. ఉద్యోగులకు మేలు చేకూర్చే రీతిలో సానుకూల నిర్ణయాలు అమలు చేస్తున్నామని వివరించారు.