కడప: తన భర్త మృతికి సిఐ శ్రీరాములు వేధింపులే కారణమని ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసులరెడ్డి భార్య ఆరోపించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులరెడ్డి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాసులరెడ్డి పోలంలో పురుగుల మందు సేవించి సోమ్మసిల్లి పడిపోవడంతో కుటుంబ సభ్యులు పులివెందులకు తరలించారు.. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతూ శ్రీనివాసుల రెడ్డి మృతి చెందారు. శ్రీనివాసులరెడ్డి నిందితుడు పరమేశ్వరరెడ్డికి సమీప బంధువు. తనకు కూడా వివేకా హత్యలో ప్రమేయం ఉందన్న అనుమానంతో సిట్ బృందం శ్రీనివాసులరెడ్డిని కస్టడిలోకి తీసుకోని విచారించింది. కేసుతో తనకేలాంటి సంబంధం లేదంటూ సీఎం జగన్, వైఎస్ భాస్కర్‌రెడ్డిలకు లేఖ రాసినట్టు సూసైడ్ నోట్‌లో శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీరాములు వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీనివాసులరెడ్డి భార్య ఆరోపించడంతో ఇప్పుడీ కేసు మరో మలుపు తిరిగింది.