పట్టు వదలని విక్రమార్కుడిలా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. అవకాశం ఇచ్చిన ప్రతి హీరోకు కథలు వినిపిస్తూనే ఉన్నాడు. ఎవ్వరూ సై అనకపోవడంతో చివరికి మంచు విష్ణుతో సినిమా ప్రకటించాడు. అయితే అది కాస్తా ఆగిపోయింది. మళ్లీ తెరపైకొస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. దీంతో శ్రీనువైట్ల ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి.
అలా ప్రయత్నించి ఎట్టకేలకు మరో అవకాశం అందుకున్నాడు ఈ దర్శకుడు. త్వరలోనే గోపీచంద్ ను డైరక్ట్ చేయబోతున్నాడు శ్రీనువైట్ల. వీళ్లిద్దరి కాంబోలో ఇదే తొలి సినిమా. ఈ సినిమాను తాజాగా అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ మూవీ.
రీసెంట్ గా పక్కా కమర్షియల్ అనే ఫ్లాప్ ఇచ్చాడు గోపీచంద్. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే శ్రీనువైట్ల సినిమా సెట్స్ పైకొస్తుంది. వైట్ల-గోపీచంద్ ప్రాజెక్టుకు గోపీమోహన్ కథ అందిస్తున్నాడు. శ్రీనువైట్ల, గోపీమోహన్ ది సూపర్ హిట్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే.
రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేశాడు వైట్ల. ఆ తర్వాత మళ్లీ అతడికి ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. అప్పట్నుంచి ఖాళీగా ఉన్న వైట్ల, ఎట్టకేలకు గోపీచంద్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.