దైవ లక్షణాలను పెంపొందించడానికి, ఆనందంగా జీవించడానికి ప్రాణాహుతి సహాయంతో ధ్యానం ఎంతో మేలు చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇది హృదయంలో దైవత్వాన్ని మేల్కొలుపుతుంది. మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.
ఈ క్రమంలోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీ రామచంద్ర కాన్సియెస్ నెస్ ప్రాణాహుతిపై అవగాహన కల్పిస్తోంది. తాజాగా రెండు రోజుల పరిచయ కోర్సు వివరాలు వెల్లడించింది. హైదరాబాద్ లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ సంస్థ. దీనికి ఎలాంటి రుసుము అవసరం లేదు. ఉచితంగా అందిస్తోంది. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు వారు రిజిస్టర్ చేసుకోవాలని కోరింది.
ఈనెల 11, 12 తేదీల్లో ఆసక్తిగల వారు నమోదు చేసుకోవాలని తెలిపింది సదరు సంస్థ. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయాన్ని కేటాయించింది.
దీనికోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్- +91 9849254605
మెయిల్ ఐడీ- tvrao1@gmail.com
వెబ్ సైట్- www.sriramchandra.in