వివాదాలకు కేరాఫ్ అడ్రస్ నటి శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రాకేష్ మాస్టర్ వరకు అందరినీ సోషల్ మీడియాలో ఆటాడుకుంది. అయితే తాజాగా శ్రీరెడ్డి బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీ రెడ్డిని బిగ్ బాస్ షో చూస్తారా అని ఓ నెటిజన్ అడగగా కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. బిగ్ బాస్ అంటే నాకు నచ్చదు. అసలు చూడను. ఇక అందులో ఉండే వాళ్ళు ఏడుపులు గోల తట్టుకోలేమని చెప్పుకొచ్చింది. అలాగే అక్కడున్న వారందరూ దొంగ ఏడ్పులు ఏడుస్తారు అని నాకు గాని బిగ్ బాస్ హౌస్ లోకి అవకాశం వస్తే అందరి అసలు రంగు బయట పెడతానని చెప్పుకొచ్చింది.
మాధవి లత కు కౌంటర్ ఇచ్చింది. మీరు పులి, పందితో పోలుచుకోకండి. నాకు బిజెపి అంటే ఇష్టం కనుక ఈ సారి నిన్ను వదిలేస్తున్నాను నువ్వు ఏదో పెద్ద నాయకురాలు అని ఫీల్ అవ్వకు సమాజంలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడకుండా కవితలు రాయటం ఏంటి ఇంకోసారి నా గురించి ఏదైనా మాట్లాడే బిడ్డ నీకు సమాధానం ఇంకోలా ఉంటుంది అంటూ శ్రీ రెడ్డి వార్నింగ్ ఇచ్చింది.