పవన్ వ్యాఖ్యలు.. శ్రీరెడ్డి కౌంటర్ ఎటాక్

అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ముందుకెళ్లాలిగానీ, మీడియా వద్దకు వెళ్తే ఎలాంటి ఉపయోగం లేదన్న పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యింది. మహిళలకు సంబంధించిన సమస్యలను గుర్తించినందుకు సంతోషంగా వుందంటూనే పవన్‌కి మరో చురక వేసింది శ్రీరెడ్డి. పవన్ లాంటి స్టార్‌డమ్ వున్న పొలిటీషియన్లు చట్టాలు, వ్యవస్థలు గట్టిగా పనిచేసేలా కృషి చేయాల్సి వుందంటోంది. తాను పోలీసు కంప్లయింట్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఫేక్ బుక్ పోస్టులో గుర్తు‌చేసింది.

I am glad that Pavan Kalyan Sir acknowledged the issues related to women, but it is important to note that it is the…

Posted by Sri Reddy on Saturday, April 14, 2018

మరోవైపు జూనియర్ ఆర్టిస్ట్ సునీత కూడా పవన్‌కల్యాణ్ సలహాను కొట్టిపారేసింది. మీడియాకి ఎక్కేబదులు లీగల్ ఫైట్ చేయడం బెటరన్న పవన్ సూచనను టీవీ డిబేట్‌లో ప్రస్తావించింది. ఓ స్టిల్ ఫోటోగ్రాఫర్‌పై తాను బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ రాత్రికి రాత్రే అది మాఫీ అయిపోయిందని చెప్పుకొచ్చింది. పోలీసుల వద్ద న్యాయం దొరకనందు వల్లే తాము మీడియా ముందుకు రావాల్సివచ్చిందని సునీతతోపాటు అనేకమంది ఆర్టిస్టులు నొక్కి చెబుతున్నారు.

https://www.youtube.com/watch?time_continue=113&v=kwBYyMdzEWA

మొత్తమ్మీద సొంత ఇండస్ర్టీకి వచ్చిన ఒక ‘కష్టం’పై సూటిగా స్పందించలేక పోయారంటూ పవర్ స్టార్ మీద రివర్స్ పంచ్‌లు పడిపోతున్నాయి.